శృంగవరపుకోట: రామరాజ్యం ఎలా ఉందో చూడలేదు కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజన్న బిడ్డ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మాత్రం ఖచ్చితంగా రామరాజ్యాన్ని తలపించే విధంగా ఉందని శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత సుపరిపాలన ఇంతకు ముందెన్నడూ లేదని ప్రజల సంక్షేమమే పరమావధి గా ఈ ముఖ్యమంత్రి పరిపాలన కొనసాగిస్తున్నారు అని ఇటువంటి ప్రభుత్వం లో భాగస్వామి గా ఉన్నందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే కడుబండి తెలిపారు... పేదల అభ్యున్నతికి కంకణం కట్టుకున్న ఈ ముఖ్యమంత్రి సమాజం లో ఏ పేదవాడు అవకాశాలు లేక ఆకలిబాధలు పడకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించి రెండేళ్ల కాలంలోనే సుమారు 95% అమలు చేసి ప్రజల మన్ననలు అందుకున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం...తన సుదీర్ఘ పాదయాత్ర లో ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని
ఎన్నికల మేనిఫెస్టో లో వాటన్నింటినీ పరిష్కరించడానికి నవరత్నాలు గా పొందుపరిచి అన్ని వర్గాల ప్రజల కు మేలు చేసే విధంగా మేనిఫెస్టోనే మా ప్రభుత్వ జీవనధార గా భావించి నవరత్నాల అమలు లో భాగంగా ఫించన్లు, అమ్మ ఒడి,ఆసరా,చేయూత,విద్యాదీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్,గోరుముద్ద
రైతు భరోసా,వాహనమిత్ర,చిరువ్యాపారులకు సాయం, మత్స్యకారులుకి ఆర్థిక సాయం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డి రుణాలు,చేనేత కార్మికుల కు,దర్జీలకు,నాయీబ్రాహ్మణులకు, అగ్రవర్ణాల పేదలకు అందరికీ అన్ని పధకాలు ఒక కేలండర్ ప్రకటించి మరీ చెప్పిన తేదీన మధ్యవర్తులు లంచాలు లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తున్న పారదర్శక ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, మహాత్మా గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం లో భాగంగా గ్రామసచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి దానికి వాలంటీర్ల వ్యవస్థ ను అనుసంధానం చేసి సుమారు 4లక్షల యువతకు ఒక్క రూపాయి అవినీతి కి, సిఫార్సు లకు తావులేకుండా నియమించి యువతకు ఉపాధి కల్పించిన ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... అర్హులైన ప్రతి లబ్దిదారునికి కుల,మత,వర్గ, పార్టీలు చూడకుండా ఓటు వేసినా వేయకపోయినా అర్హులందరికీ అన్ని ఫలాలు అందాలన్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్ పుట్ సబ్సిడీ,క్రాప్ ఇన్సూరెన్స్,కనీస మద్దతు ధర, నాణ్యమైన ఎరువులు, విత్తనాల కోసం రైతు భరోసా కేంద్రాలు,ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటు, మద్దతు ధర
వ్యవసాయానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆదేశించిన పరిపాలనా దక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి..మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు ఉండాలని అన్నింటా సగభాగం వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి
కార్పోరేషన్ లలో, స్థానిక సంస్థల రిజర్వేషన్ల లో ,ఇళ్ళ పట్టాల లో వాళ్ళకే అగ్రతాంబూలం ఇచ్చి పురుషులతో సమానంగా మహిళలను నిలబెట్టిన ఆదర్శ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...కరోనా విజృంభణ లో కూడా ఏ పధకాలను వాయిదా వేయకుండా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కూడా అనుకున్న తేదీకి ఖచ్చితంగా లబ్దిదారులకు నేరుగా అందించిన మాటతప్పని,మడమతిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.... వెనుకబడిన కులాలే వెన్ను ముక గా భావించి అన్ని కులాలకు కార్పోరేషన్లు స్థాపించి అందరికీ అన్ని విషయాలలో ముందుకు తీసుకు వెళ్ళిలనే దార్శనికుడు మన ముఖ్యమంత్రి అని ఎమ్మెల్యే అన్నారు.... నియోజకవర్గ పరిధిలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నట్లు అన్ని గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు...NRGS నిధులతో సిమెంట్ రోడ్లు, కాలువలు కోట్ల రూపాయల నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఎమ్మెల్యే కడుబండి తెలిపారు.... నియోజకవర్గ త్రాగునీటి అవసరాలకోసం 99కోట్ల రూపాయలు జలజీవన్ మిషన్ ద్వారా నిధులు మంజూరు చేయించి పరిపాలనా అనుమతులు కూడా తీసుకుని వచ్చినట్లు ఎమ్మెల్యే కడుబండి తెలిపారు... పెందుర్తి-బౌడారా రోడ్డు మరమ్మతులు, విస్తరణ ప్రతిపాదనలు పూర్తి అయి టెండర్లు దశలో ఉన్నట్లు తెలిపారు... శృంగవరపుకోట సామాజిక ఆసుపత్రి 100పడకల ఏరియా ఆసుపత్రి గా మార్చి విస్తరణ నిధులు కూడా మంజూరు చేయించినట్లు, కొత్తవలస PHC ని CHC గా,జామిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు త్వరలో కార్యరూపం దాల్చుతుంది అని శృంగవరపుకోట, కొత్త వలస మేజర్ పంచాయతీలు నగర పంచాయితీ లగా మార్చాలని ప్రభుత్వ దృష్టి లో ప్రతిపాదనలు ఉంచామని తెలిపారు... రానున్న మూడేళ్లలో ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి
బొత్స సత్యనారాయణ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి మరింత పాటుపడతానని నియోజకవర్గ అభివృద్ధి కి అన్ని మండలాల్లో గల పార్టీ నాయకులను, కార్యకర్తల సహాయ సహకారాలు తీసుకుంటూ జిల్లాలోనే నియోజకవర్గాన్ని ప్రథమ స్థానంలో ఉంచుతానని అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్, సామాజిక దూరంతో మెలగాలని, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రజలు అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో ఆయన ఆశయ సాధన కు కృషి చేస్తానని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు.....